జిల్లా స్థాయిక్రికెట్ పోటీలు ప్రారంభించిన వెంకటరెడ్డి.
జిల్లా స్థాయిక్రికెట్ పోటీలు ప్రారంభించిన వెంకటరెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి తగాదాలకు తావు లేకుండా పోటీల్లో పాల్గొనాలని సూచించారు ఆటలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాయామం లేక చాలామంది పనుల్లో బిజీ అవుతున్నారని శారీరక శ్రమ కోసం తప్పనిసరిగా ఆటలు ఆడాలని చెప్పారు స్పోర్టివ్ గా తీసుకొని క్రీడల్లో పాల్గొనాలని ఆయన క్రీడాకారులకు సూచించారు.
పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఎస్సై బాధావత్ రవి కాంగ్రెస్ నాయకులు మాలోత్ మంగీలాల్ నాయక్. నాయుడు రాథోడ్ నిర్వాహకులు షఫీ అన్వేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post a Comment