అగ్ని ప్రమాదం పూరిల్లు దగ్ధం.సర్వం బుగ్గిపాలు.
అగ్ని ప్రమాదం పూరిల్లు దగ్ధం.సర్వం బుగ్గిపాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళపాడు గ్రామపంచాయతీ శివారు పంతులు తండాకు చెందిన గుగులోత్ రాందాస్ ఇల్లు ప్రమాదవశాత్తు బుధవారం వారంఅగ్నికి ఆహుతి అయింది. అగ్ని ప్రమాదంలో సర్వం బుగ్గిపాలయ్యాయి. కట్టు బట్టలు మాత్రమే మిగిలాయంటూ ఆ కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి వద్ద యజమాని లేడని చెబుతున్నారు స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నాలు ఏమి ఫలించలేదు ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లల సర్టిఫికెట్లు దస్త్రాలన్నీ కాలిపోయాయని తెలుస్తోంది.
Post a Comment