ధరణి చూపించని, పరిష్కారం భూభారతీ చూపిస్తుంది.కలెక్టర్ జితేష్ వి పాటిల్.


ధరణి చూపించని, పరిష్కారం భూభారతీ చూపిస్తుంది.కలెక్టర్ జితేష్ వి పాటిల్.


 ధరణి చూపించని, పరిష్కారం భూభారతీ చూపిస్తుంది.కలెక్టర్ జితేష్ వి పాటిల్.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో  భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సును స్థానిక తహసిల్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ . తో పాటు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.

 అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులను ఉద్దేశించి కలెక్టర్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని అంశాలను రైతులకు అర్థమయ్యే విధంగా వివరించారు రైతు భూ సమస్యలకు భూభారతి ద్వారా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని రైతులు ఇక సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు గతంలో ఉండే ధరణి ద్వారా కొనుగోలు అమ్మకాలు కోర్టులకు వెళ్లడం లాంటివి జరిగిన అని మిగతా సమస్యలకు పరిష్కారం లేకుండా పోయిందని అన్నారు ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా భూభారతి ద్వారా రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపెడతామని అన్నారు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకమైన అధికారులు కూడా ప్రభుత్వం నియమించిందని అన్నారు

 అయితే ఇప్పటికిప్పుడే రైతులందరూ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని భూభారత్ చట్టంపై గ్రామసభలు ఏర్పాటు చేసుకొని తద్వారా సత్వర పరిష్కారం చూపెడతామని అన్నారు ప్రస్తుతం ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు.



 *ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అవకత ఒకలకు తావులేదు ఎమ్మెల్యే రాందాస్ నాయక్* 


రాందాస్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ధరణిని తీసివేసి దాని స్థానంలో భూభారతి చట్టాన్ని రైతుల పరిష్కారం కోసం తీసుకువచ్చామని ఇక ఏ ఒక్క రైతు కూడా భూ సమస్యలపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఒకదానివి తర్వాత ఒకటి అమలుపరిచేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను కచ్చితంగా ఒంటరి మహిళలకు ఇండ్లు లేనీ నిరుపేదలకు ఇస్తామని ఎలాంటి అవకతవకలకు తావు లేదని అన్నారు

 కార్యక్రమంలో నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మంగీలాల్ నాయక్ ,విజయ భాయ్, దుద్దుకూరు మధుసూదన్ రావు ,ఎక్స్ ఎంపిటిసి సతీష్ ,నున్న రంగారావు ,వేల్పుల నరసింహారావు, ఆర్డీవో,తాసిల్దార్ స్వాతి బిందు, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి. ఎఫ్ ఆర్ ఓ ప్రసాదరావు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.