ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకా... మహిళల ఆగ్రహం. గ్రామపంచాయతీ కి తాళం.
ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకా... మహిళల ఆగ్రహం. గ్రామపంచాయతీ కి తాళం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచిన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం గేట్లకు మహిళలు శుక్రవారం తాళంవేశారు. అర్హులైన రేకులున్న వారికి వితంతువులకి పూరి గుడిసెలు ఉన్నవారికి మొదటి లిస్టులో పేరు వచ్చిందని ఆ తర్వాత పేర్లు మాయం అయ్యాయని మా పేర్లు ఎందుకు తీశారు అంటూ గేట్లకు తాళం వేసి గేటు ముందు బైఠాయించినిరసన తెలియజేశారు.
అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయాలని గ్రామంలో ఏదో జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటిలో నిజం అయిన లబ్ధిదారుల పేర్లు లిస్టులో ఉన్నప్పటికీ ఇప్పుడు లిస్టులో లేకపోవడం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు.
Post a Comment