కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా. 15 మందికి గాయాలు. కొత్తగూడెం ఆస్పత్రికి తరలింపు.
కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా. 15 మందికి గాయాలు. కొత్తగూడెం ఆస్పత్రికి తరలింపు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళ పాడు పెద్దవాగుపై బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో కూలీలతో వెళుతున్న ట్రాలీ టైర్ పగిలి వాగులోకి దూసుకు వెళ్ళింది ఈ ప్రమాదంలో సుమారు 15 మంది వరకు గాయాల పాలయ్యారు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలం వద్ద చేరుకొని క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాగులో పడ్డ ట్రాలీని ట్రాక్టర్ సహాయంతో బయటకు తీయించారు. ప్రమాద సమయంలో ట్రాలీలో సుమారు 25 నుంచి 30 మంది కూలీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది టైర్ పగిలిపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది . కూలీలంతా బేతాళ పాడు గ్రామం పరిసర ప్రాంతాల వారు.
*వాహనదారులకు ప్రమాదంగా మారిన బ్రిడ్జ్*
పెద్ద వాగు పై ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జ్ ప్రమాదగంటికలను మోగిస్తోంది గతంలో ఈ బ్రిడ్జి పైనుంచి వాహనాలు పడి ప్రమాదాలు జరిగినప్పటికీ బ్రిడ్జ్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు బ్రిడ్జిపై రెండు వైపులా ఎలాంటి జాగ్రత్తలు లేవు మరియు బ్రిడ్జ్ మూలమలుపు కావడం దిగువ భాగంలో ఉండటం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాలలో ఈ ప్రమాదాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికైనా బ్రిడ్జ్ కి రెండు వైపులా గోడను ఏర్పాటు చేయాలని బ్రిడ్జి ఎత్తును పెంచాలని బ్రిడ్జి వద్ద విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు
Post a Comment