భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టు దళ సభ్యులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టు దళ సభ్యులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
కొత్తగూడెం కేంద్రంలోని రామచంద్రపురం పోలీస్ హెడ్ కోటర్స్ లో ఎస్పీ రోహిత్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు కొత్తగూడెం పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు జిల్లా పోలీసులు 81 బెటాలియన్ మరియు 141 వ బెటాలియన్ సిఆర్పిఎఫ్ అధికారులు ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు తో పాటు ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా మరియు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఆదివాసి ల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస చర్యలు భాగంగా మావోయిస్టులు లొంగిపోతున్నట్లు చెప్పారు.
లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి ఆయన 25 వేల రూపాయల నగదును అందజేశారు లొంగిపోయిన 14 మంది సభ్యులలో 11 మంది పురుషులు ఉండగా ముగ్గురు మహిళలు ఉన్నారు ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 20027 మంది మావోయిస్టు సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నవారు పోలీసులు ఎదుట లొంగిపోవడం జరుగుతుందని అన్నారు గత కొంతకాలంగా సిపిఐ మావోయిస్టు పార్టీ పై ఆదివాసీలలో నమ్మకం కోల్పోయారని కాలం చెల్లిని సిద్ధాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ మావోయిస్టు పార్టీలో ఉంటే తన మను కూడా ఉండదని భావించి ఆదివాసీలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా వారికి చేయూతనిస్తుందని అన్నారు ఇన్ఫార్మర్ల నెపంతో చాలామంది అమాయకులు చనిపోయారని హింసించడం తగదని అని ఆయన అన్నారు. ముఖ్యంగా సిఆర్పిఎఫ్ క్యాంపులు తో పాటు అడవుల్లో వారి ఉనికి పూర్తిగా కోల్పోతున్నారని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాసాలకు ఆకర్షితులై లొంగిపోవడం జరుగుతుందని అన్నారు
బైట్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
Post a Comment