ఆలయ భూముల లెక్కలు తేల్చిన అధికారులు. వేయించారు సరిహద్దు బండలు.
ఆలయ భూముల లెక్కలు తేల్చిన అధికారులు. వేయించారు సరిహద్దు బండలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం భూములు ఆక్రమణలకు గురి అయ్యాయని గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మొత్తం దేవాలయానికి సంబంధించిన భూమి( దేవుని మాన్యం)10 ఎకరాల 16 కుంటలు ఉండాలని అట్టి భూమిని ఆలయ అధికారులు వేలంపాట ద్వారాకౌలుకు ఇస్తున్నారు. ఇటీవల ఆలయ అధికారులకు కౌలుదారులకు కౌలు విషయంలో వ్యత్యాసాలు ఏర్పడ్డాయి.
అయితే కవులు దారుడు ఆలయ అధికారులు చెప్పినట్లుగా 10 ఎకరాల 16 కుంటలు లేదనీ. తక్కువ ఉందని కౌలు లో కొంత తగ్గించాలని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో. అటు ఆలయ అధికారులు ఇటురెవెన్యూ అధికారులు భూమి హద్దులను నిర్ణయించేందుకు శుక్రవారం నడుం బిగించారు. పాపకొల్లు రెవిన్యూ పరిధిలోని గుండ్ల రేవు రాంపురం గ్రామాల సరిహద్దు నందుగల సర్వే నెంబర్ (1050 )నందు 4 -00 ఎకరాలు మరియు (1051) నందు 6 -16 ఎకరాలు మొత్తం 10-16 ఎకరాల దేవుడి మాన్యం భూమిని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు
ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారుఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బెల్ సింగ్, దేవాదాయ శాఖ సర్వేయర్ అనిల్ కుమార్,జూలురుపాడు రెవెన్యూ సర్వేయర్ ప్రవీణ్, ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయ ఈవో వెంకటరావు, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, కల్లూరు టెంపుల్ ఈవో సూర్య ప్రకాష్ రావు, నాచారం టెంపుల్ ఈవో శేషయ్య, అనుపరెడ్డిపల్లి ఈవో వెంకటరమణ, ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ కోదుమూరి కోటేశ్వరరావు, టీపీసీసీ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ నవీన్ రాథోడ్, ఆలయ సిబ్బంది బి. సంపత్ మరియు దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు,గ్రామస్తులు, భూమి హద్దు దారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment