వినోబా నగర్ గ్రామం వద్దరెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆస్పత్రి లో చికిత్స పొందుతూవ్యక్తి మృతి.
వినోబా నగర్ గ్రామం వద్దరెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆస్పత్రి లో చికిత్స పొందుతూవ్యక్తి మృతి.
*రోడ్డు ప్రమాదం.
రెండు కార్లు ఢీకొన్న ఘటన ఓకారు డ్రైవర్ మృతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోద్ నగర్ శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో కార్లలో ఉన్న వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారందరినీ పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొత్తగూడెం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఓకారు డ్రైవర్ మృతి చెందాడు అయితే హైదరాబాదు నుంచి దక్షిణ కొరియాకు చెందిన ముగ్గురు టూరిస్టులు ఓ కారులో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను చూసేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న ఆళ్లపల్లి మండలం రామానుజ గూడెం గ్రామానికిచెందిన వానపాకుల సాంబశివరావు 25తన భార్య. మరియు మరదలు కలసి కారులో హైదరాబాద్ వెళుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి కార్లలో ఉన్న వ్యక్తులకు డ్రైవర్లకు గాయాలయ్యాయి కారుడ్రైవర్ సాంబశివరావు చికిత్స పొందుతూ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయాడు, దక్షిణ కొరియా వాసులకు రక్త గాయాలయ్యాయి వీరందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Post a Comment