ఆందోళనలో అనంతారం.అంతుచిక్కని కిడ్నీ వ్యాధులు.

 

ఆందోళనలో అనంతారం.అంతుచిక్కని కిడ్నీ వ్యాధులు.

ఆందోళనలో అనంతారం.అంతుచిక్కని కిడ్నీ వ్యాధులు. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... నవంబర్ 17(టీవీ 17 న్యూస్)

 మండల కేంద్రం లోని అనంతారం గ్రామంలో ఎప్పుడు ప్రజలను సమస్యలు వేధిస్తున్నాయి గ్రామంలోని ఎందుకు ఇంత మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని సమస్య మానసిక క్షోభకు గురిచేస్తుంది వయస్సుతో తేడా లేకుండా కిడ్నీ వ్యాధితో వృత్తి వాత పడుతున్నారు. 

వరుస మరణాలతో గ్రామంలో భయాందోళనలు పెరుగుతున్నాయి ఇప్పటిక గ్రామంలో 40 మంది వరకు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుండగా కొందరు మంచానికే పరిమితమయ్యారు మరికొందరు డయాల సిస్ చేయించుకుంటున్నారు మరికొందరు మృత్యువాత పడ్డారు అయితే గ్రామానికి ఏమైనా అరిష్టం చేరిందా అనేది కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్పందించిన డాక్టర్లు వాటర్ శాంపిల్స్ సైతం చేయించారు.

 అయితే వాటర్ లో ఎలాంటి సమస్య లేదనేది తేటతెళ్ళం కావడంతో ఇక వేరే సమస్యలపై అధికారులు దృష్టి పెట్టారు జన్యుపరమైన లోపాలు ఉన్నాయా లేక వీరు స్థానికంగా వైద్యం చేసే డాక్టర్లు రాసే మందులు ఏమైనా వాడుతున్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

 *కలెక్టర్* స్పందించడంతో డాక్టర్లు మంగళవారం గ్రామంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు గ్రామంలో అనారోగ్యంగా ఉన్న వారి రక్తం మూలాలను సేకరిస్తున్నారు మండలాధికారులు సైతం హెల్త్ క్యాంపు వద్దకు చేరుకొని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు కళాజాత కార్యక్రమం తో కూడా గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. 

అయితే డాక్టర్ వెంకటేశ్వర్లు మాత్రం మద్యపానం ,రోగ నిరోధక శక్తి మాత్రలు అధికంగా వాడడం ,ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులకు సూచిస్తున్నారు. మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి మండల పంచాయతీ అధికారి తులసి రాములు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.

Blogger ఆధారితం.