రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం ....కలెక్టర్ జితేష్ vపాటిల్ జులూరుపాడులో పలు గ్రామాల సందర్శన.


రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం ....కలెక్టర్ జితేష్ vపాటిల్     జులూరుపాడులో పలు గ్రామాల సందర్శన.


రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం ....కలెక్టర్ జితేష్ vపాటిల్     జులూరుపాడులో పలు గ్రామాల సందర్శన.

జూలూరుపాడు మండలంలో ఉదయం 7:30 గంటలకే కలెక్టర్ జితేష్ పార్టీ ఇంకుడు గుంతలను మునగ తోటను క్యాటిల్ షెడ్డును. వేసవి కాలంలో పిల్లలకు ఆటపాటలపై శిక్షణ లను పరిశీలించారు. మొదట మాచిపేటలో ఇంకుడు గుంతలను ఆయన పరిశీలించారు అనంతరం గొపా తండాలో బాల్య అనే రైతుమునగ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా బాల్యను ఆయన అభినందించారు. మునగ చెట్లకు ఉన్న కాయలను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు మార్కెటింగ్ ధరలను అడిగి తెలుసుకున్నారు కొనుగోలుదారులే రైతుల వద్దకు వస్తున్నారని రైతు చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు.






 మునగ పంట వల్ల రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని అన్నారు అలాంటి నీటిని వృధాగా పోనిచ్చుకోకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలకు పెంచుకునేందుకు అవకాశం ఉందని అన్నారు

 దన్నుమిట్ట తండాలో క్యాటిల్ షెడ్డు నిర్మాణాన్ని ఆయన పరిశీలించి రైతుతో మాట్లాడారు రైతు చెప్పిన ప్లానింగ్ ను కలెక్టర్ మెచ్చుకున్నారు సాంకేతిక సలహాలు కావలిస్తే ప్రభుత్వం నుండి అందిస్తామని అన్నారు. 

 *ఇందిరమ్మ ఇండ్ల ప్రస్తావన కలెక్టర్ వద్ద* 


కలెక్టర్ పర్యటనలో, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని లిస్టులో పేర్లు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వారికి అర్థమయ్యేలా వివరించారు. అర్హులు ఎక్కువ ఉన్నందున అందరికీ ఒకేసారి ఇండ్లు ఇవ్వడం సాధ్యం కాదని అలా అని లిస్టులో పేర్లు లేకపోవడం అనేది ఏమి ఉండదని తొలి దశ లో కొందరికి మలిదశలో మరికొందరికి ఇండ్లు ఇచ్చే ఏర్పాటు జరుగుతుందని ఎవరు ఇండ్లు రాలేదని లిస్టులో పేరు లేదని బాధపడాల్సిన పనిలేదని చెప్పారు.

Blogger ఆధారితం.