సర్వ శిక్ష ఉద్యోగులు. మోకాళ్లపై నిరసనలు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
సర్వ శిక్ష ఉద్యోగులు. మోకాళ్లపై నిరసనలు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నవంబర్ 17 (టీవీ 17న్యూస్) జిల్లా వ్యాప్తంగా గత ఏడు రోజుల నుంచి సర్వ శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తూ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలియజేస్తున్న విషయం విధితమే అయితే సీఎం గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ ఆందోళన బాట పట్టారు 8వ రోజు అయిన మంగళవారం మోకాళ్లపై నిరసన తెలియజేశారు.
18 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతున్న నేటికీ ఉద్యోగాలు రెగ్యులర్ చేయలేదని నినాదాలు చేస్తూ సీఎం వెంటనే స్పందించి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment