తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు..

 
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు..

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు..

బంగాళాఖాతంలో నేడు తుపాన్ తీరం దాటనుంది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వాతావర ణశాఖ సూచించింది. 

శనివారం ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యపేట, మహబూ బాబాద్, నల్లగొండ, వరంగల్, హన్మకొండి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


ఆదివారం, సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యపేట, మహబూ బాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలతో పాటు... 


సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Blogger ఆధారితం.