మునగ సాగు చేపట్టండి కలెక్టర్ జితేందర్ వి పాటిల్. విత్తనాలు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
మునగ సాగు చేపట్టండి కలెక్టర్ జితేందర్ వి పాటిల్.విత్తనాలు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 12 (టీవీ 17 న్యూస్)
చండ్రుగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మునగ సాగుపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారంనిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ నీటి వనరులు తక్కువగా ఉన్న కూడా మునగ సాగుకు అనుకూలమన్నారు.
సంవత్సరానికి రెండు సార్లు పంట దిగుబడితో ఎకరాకి 60 వేల వరకు లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు.
మునగ కొనుగోలుకు మార్కెటింగ్ ప్రభుత్వమే చూపిస్తుందన్నారు.
మునగ విత్తనాలు, లేదా మొక్కలను ప్రభుత్వమే అందిస్తుందన్నారు.
ఎన్ ఆర్ ఈజీఎస్ ద్వారా విత్తనాలు నాటిన దగ్గర నుండి కాపు వచ్చేదాకా పెట్టుబడులు ప్రభుత్వమే ఇస్తుందని కలెక్టర్ తెలిపారు.
వేప నూనెతో తెల్ల గొంగళి పురుగుకు స్వస్తి చెప్పవచ్చునని,
మునగ ఆకుల ద్వారా ఆదాయం పొందవచ్చు అన్నారు.
మునగ సాగు చేసేందుకు అన్ని విధాల ప్రభుత్వమే సాయం అందిస్తున్న నేపథ్యంలో రైతులు మునగ పంట సాగు చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ రైతులను కోరారు.
ప్రస్తుత వేస్తున్న పత్తి మిరప తదితర పంటల సాగులో నాలుగు శాతం మునగ సాగు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు.
Post a Comment