విద్యుత్ షాక్ తో పంచాయితీ కార్మికుడు మృతి . తరుణ్. 23సం.6నెలల క్రితమే పల్లవితొ వివాహం*

 


విద్యుత్ షాక్ తో పంచాయితీ కార్మికుడు మృతి . తరుణ్. 23సం.6నెలల క్రితమే పల్లవితొ వివాహం* 



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు నవంబర్ 12 (టీవీ 17 న్యూస్) మండల పరిధిలోని చింతల తండ గ్రామ పంచాయితీలో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న భానోత్ తరుణ్( 23 సం//) మంగళవారం విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

 తరుణ్ చింతల్ తండా గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా  గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు మంగళవారం  చెట్ల కొమ్మలను నరుకుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్ల కొమ్మలు 11 కె.వి వైర్లకు తగలడంతో షాక్ తో తరుణ్ తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో. మృతి చెందాడు.

తరుణ్ కి గత ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది తరుణ్ మృతి తో చింతల్ తండా గ్రామంలో విషాదాఛాయలుఅనుముకున్నాయి కుటుంబ సభ్యుల రోదనలు  మిన్నంటాయి,తరుణ్ కుసతీమణి పల్లవి కలదు.

Blogger ఆధారితం.