ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలి అంటూ ఈరోజు భద్రాచలం ఐటిడిఏ పిఒ గారికి వినతిపత్రం అందించడం జరిగినది కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ
జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మారిస్తే ఎన్నో ఆరోగ్య సేవలు ప్రజలకు అందుతాయని వారన్నారు
అదేవిధంగా జూలూరుపాడు మండలం పూర్తి ఏజెన్సీ మండలం అలాంటి ఏజెన్సీ మండలంలో పేద దళిత గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందక వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున జూలూరుపాడు మండల ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా చేయాలని వారు కోరారు .
వాటితో పాటుగా డయాలసిస్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని కోరటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గ ప్రసాద్బ హుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు పాల్గొన్నారు.
Post a Comment