కాంగ్రెస్ కండవాలు కప్పుకున్న BRS నాయకులు కార్యకర్తలు.స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. ఎంపీ రఘురాంరెడ్డి.

కాంగ్రెస్ కండవాలు కప్పుకున్న BRS నాయకులు కార్యకర్తలు.స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. ఎంపీ రఘురాంరెడ్డి.



కాంగ్రెస్ కండవాలు కప్పుకున్న BRS నాయకులు కార్యకర్తలు.స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. ఎంపీ రఘురాంరెడ్డి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సర్వారం సింగభూపాలెం రాఘవపురం గ్రామాలలో ఎంపీ రఘురాంరెడ్డి పర్యటించారు ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా గ్రామాలకు వచ్చిన పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు 

ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు BRSపార్టీని వీడి ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ తీర్గం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు గెలిపించి ఢిల్లీకి పంపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని అన్నారు. 

కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు క్యాంప్ ఆఫీసులో సమస్యలు వినే వ్యక్తులు నియమించామని ఎలాంటి సమస్యలు ఉన్న తెలియజేయాలని సూచించారు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పు ఎక్కువ సమయం ప్రజల సమస్యల కోసం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు

 స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాగ సీతారాములు చింతలపూడి రాజశేఖర్ విజయ భాయ్ మండే వీర హనుమంతరావు. తదితరులు పాల్గొన్నారు.

నాయకుల ఆవేదన..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నియోజకవర్గంలో నాయకులు నిరుత్సాహానికి గురి అవుతున్నారని ఆదరణ కరువైందని సభలో ప్రస్తావించగా ఎంపీ కలుగజేసుకొని మన ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే గారు సమన్వయంతో ముందుకు వెళతారని సూచించారు.

Blogger ఆధారితం.