నిరుపేదడాక్టర్ విద్యార్థిని ఆదుకున్న డాక్టర్ ఇరుకు బాబురావు.అమృత హాస్పిటల్ ఔదార్యం.
నిరుపేదడాక్టర్ విద్యార్థిని ఆదుకున్న డాక్టర్ ఇరుకు బాబురావు.అమృత హాస్పిటల్ ఔదార్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం.
ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం కు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించాడు చదువులలో ముందుండే సాయికిరణ్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీటు సంపాదించాడు. ప్రస్తుతం ఎంబిబిఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కానీ వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది తల్లిదండ్రులు రోజు కూలీల పై ఆధారపడి ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో కాలేజీలో చేరిన సాయికిరణ్ హాస్టల్ ఫీజులు చెల్లించే పరిస్థితి లేక తన బాధను ఓలేక ద్వారా పోస్ట్ చేశాడు. ఆ లేఖను చూసి స్పందించిన కొత్తగూడెంలోని అమృత హాస్పిటల్ డాక్టర్ ఇరుకు బాబురావు స్పందించి సాయికిరణ్ హాస్టల్ ఫీస్ చెల్లించేందుకు ముందుకు వచ్చారు . వెంటనే27 వేల రూపాయలను యూనివర్సిటీ బ్రాంచ్ కు పంపించడంతో సాయికిరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ గారి కీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆపదలో ఆదుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రజలు డాక్టర్ బాబురావు నుఅభినందిస్తున్నారు . జిల్లావ్యాప్తంగా తన ఆసుపత్రికి వచ్చేపేద ప్రజలకు తక్కువ ఖర్చులతో వైద్యం చేసే ఇరుకు బాబురావు పేద వైద్యవిద్యార్థి పట్ల మానవత్వం ప్రదర్శించి హాస్టల్ ఫీజు చెల్లించినందుకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. కీప్ ఇట్ అప్ డాక్టర్ గారు అంటున్నారు.
Post a Comment