నవోదయ లో మూడు సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు. అభినందించిన ఎంఈఓ ఝంకిలాల్.
నవోదయ లో మూడు సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు. అభినందించిన ఎంఈఓ ఝంకిలాల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పాపకొల్లు రోడ్డులోగల సాయి ఎక్స్ లెంట్ స్కూల్ విద్యార్థులు నవోదయలో 3సీట్లు సాధించినందుకు శనివారం జూలూరుపాడు మండల విద్యాధికారి జుంకీలాల్ ముగ్గురు విద్యార్థులను తన కార్యాలయంలో అభినందించారు . నవోదయలో అర్హత సాధించిన వారిలో *భరత్ కార్తికేయ* తండ్రి నరసింహారావు *నండ్రు విశ్వ సన్నిధ్* తండ్రిగురుమూర్తి, *కొలిపోక యశ్వంత్* తండ్రి సురేష్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓమాట్లాడుతూవిద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసుకువచ్చి నవోదయలో సీట్లు పొందేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయుల ప్రతిభ ఎంతో గొప్పదని ఆయన అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విద్యాలయాల్లో సీట్లు సాధించేందుకు సాయి ఎక్స్ లెంట్ ఉపాధ్యాయులు మరింత సాధన అందించాలని ఉత్తమ విద్యార్థులను మరింత మందిని తయారు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా విద్యార్థులతో విజయం సాధిస్తూ సాయి ఎక్స్ లెంట్ స్కూల్ ను జిల్లా స్థాయిలో రాణిస్తున్నందుకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మండల ప్రజలకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ కు పిల్లలను పంపిన తల్లిదండ్రుల నమ్మకాన్ని మరియు శ్రమతో పిల్లలకు అందుబాటులో ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపించి వారి విలువైన సమయాన్ని విద్యార్థులకు కేటాయిస్తూ తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఎంత విజయాన్ని సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హుస్సేన్ నాగరాజు బండ్ల మధుసూదన్ రావు. కొలిపాక వెంకటేశ్వర్లు బండ్ల వెంకట్ నరసింహారావు కొలిపాకసురేష్ హలవత్ నరసింహారావు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment