కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘనంగా వైయస్సార్ వర్ధంతి. ముఖ్యఅతిథిగా లేళ్ల వెంకటరెడ్డి.
కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘనంగా వైయస్సార్ వర్ధంతి. ముఖ్యఅతిథిగా లేళ్ల వెంకటరెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాళోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకటరెడ్డి జూలూరుపాడు లోనిపాపకొల్లు క్రాస్ రోడ్డులో ఉన్నవైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైయస్సార్ ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల గుండెల్లో వైయస్సార్ చిరస్మరణీయంగా ఉంటారని అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో నేటి వరకు గుర్తింపు పొందుతున్నాయని అలాంటి మహా నేతకు నివాళులర్పించడం సంతోషంగా ఉందని అన్నారు వైయస్సార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు దుద్దుకూరు మధుసూదన్ రావు. పాలెపు నాగేశ్వరరావు. పోతురాజు నాగరాజు . కిషన్ నాయక్, నవీన్ రాథోడ్, ఇల్లంగి సుందర్రావు ,కుమార్, మందదేవేందర్ రామస్వామి అనిల్ నాయక్. పత్తిపాటి యోహాన్. పనితి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
Post a Comment