జాతీయ ఎస్టి ఎస్సి కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.
జాతీయ ఎస్టి ఎస్సి కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....జూలూరుపాడు మండల కేంద్రంలోనీ వెంగన్నపాలెం గ్రామంలోఎస్సీ ఎస్టీ కేసు విచారణ నిమిత్తం ఇల్లెందు డిఎస్పి చంద్రభాను బాధిత కుటుంబాలను విచారించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ఓ గిరిజన మహిళ తన కులం పేరుతో దూషించారని అవమానంతో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిందని అన్నారు. కమిషన్ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలను ఉన్నత అధికారులకు తెలియపరస్తామని అన్నారు.
బాధితులు మాట్లాడుతూ పురుగుల మందు షాపులొ దొంగతనం కేసులలో నా కుమారుని పై అక్రమ కేసు పెట్టారని. ఆ కేసులు కొట్టివేయాలంటే కొంత నగదు ను డిమాండ్ చేశారని,అంత స్తోమత నా దగ్గర లేదని నేను అనడం తో ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని అడిగారు. నేను ఇంటి స్థలం పట్టా ఇచ్చిన కూడా నా కుమారుడు పై నమోదు అయినది.కేసు కొట్టేవేయలేదని మరియు బెదిరింపులకు పాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఫిర్యాదు చేసిన కేసును తప్పుడు కేసని ఎంక్వయిరీ అధికారి కొట్టివేయడంతో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ను ఆశ్రయించినాము అని బాధిత మహిళ పేర్కొన్నారు.
Post a Comment