ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు. నిర్లక్ష్య సమాధానం.
ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు. నిర్లక్ష్య సమాధానం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు కాలం చెల్లిన మందులు ఇస్తూ రోగుల ప్రాణాలతోచెలగాటం ఆడుతున్నారు.
ఓ పక్క స్టాప్ కొరత మరొక మందులు కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు మండలంలో గత రెండు నెలల నుండి విష జ్వరాలు ప్రబలినాయి. కొందరు మంచాలకే పరిమితమవుతున్నారు. కొందరుకు మోకాళ్ల నొప్పులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి కొందరు నడవలేని పరిస్థితి ఏర్పడింది నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలియక రోగులు సతమతమవుతున్నారు.
ఈ క్రమంలో ఆసుపత్రుల్లో వైద్యుల కొరతతో రోగులు క్యూ కడుతున్నారు అయితే జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రాసిన మందులు కోసం ఫార్మసిస్ట్ దగ్గరకు వెళితే కాలం చెల్లిన మందు బాటిల్ ఇవ్వడంతో రోగులు ఆసుపత్రి వద్దకు చేరి డాక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల బదిలీపై వచ్చిన ఓ ఫార్మాసిస్ట్ రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విసుగు చెందుతుందని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు.
విష జ్వరాలు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోవడంతో ప్రతి కుటుంబంలో మూడు నుంచి పదివేల వరకు ఖర్చవుతుంది పట్టణాలకు వెళ్తే ఈ ఖర్చు మరింతగా పెరుగుతుంది ఆస్పత్రిలో టెస్టులు అందుబాటులోకి తీసుకువస్తే ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని రోగులు చెబుతున్నారు. గిరిజన మండలమైన జూలూరుపాడు లో ఆసుపత్రి సౌకర్యాలు మెరుగు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
రోగులు. కొందరు బదిలీలపై జూలూరుపాడు వచ్చిన ఇష్టంగా పని చేయడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
Post a Comment