మాచినేని పేటతాండాలో కార్డెన్ సెర్చ్. ద్విచక్ర వాహనాలు సీజ్.
మాచినేని పేటతాండాలో కార్డెన్ సెర్చ్. ద్విచక్ర వాహనాలు సీజ్.
జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండా గ్రామంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్డెన్ సెర్చ్ జరిగింది
డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, పోలీస్ సిబ్బంది కలిసి గ్రామాల్లోని ఇళ్లల్లో, దుకాణాలలో సోదాలను నిర్వహించారు.
సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను ఆటోలను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లో ఉన్న 10 గ్యాస్ సిలిండర్లు, సుమారు 25 వేల రూపాయలు విలువచేసే నాటు సారాతో పాటుగా సారా తయారు చేసేందుకు ఉపయోగించే బెల్లంను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్పి మాట్లాడుతూ ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని తెలిపారు. గంజాయి, ముత్తు పదార్థాలను రవాణా చేసి కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు.
వాహనాలకు సంబంధించి అన్ని పత్రా లను కలిగి ఉండాలని తెలిపారు.
మాచినేని పెడతండాలో ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతుడంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు..
Post a Comment