తల్లాడ సర్పంచ్ బరిలో షేక్. రోబో
తల్లాడ సర్పంచ్ బరిలో షేక్. రోబో
తల్లాడ, జులై 12 (టీవీ 17న్యూస్):
తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో తల్లాడకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రజా కలం ఖమ్మం జిల్లా స్టాపర్ షేక్. మెహరాజ్ (రోబో) ఉండనున్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో 41% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తల్లాడ గ్రామపంచాయతీ సర్పంచ్ బిసి రిజర్వేషన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీ మైనార్టీ వర్గానికి చెందిన రోబో సర్పంచ్ బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు తన వర్గానికి సమాచారం అందించారు.
గతంలో జనరల్, ఎస్సీ, ఎస్టీ సర్పంచులు విజయం సాధించారు. ఈసారి బిసి సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు ముస్లిం నాయకులు కలిస్తే గెలుపు తనదే అవుతుందని భావించి ఎన్నికల్లో పోటీ చేస్తానని రోబో ప్రకటించారు
Post a Comment