ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నడుం బిగిద్దాం.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నడుం బిగిద్దాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి లేని న్యూ కాలనీలో మాలలు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు పూల రవీందర్ హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాలలను ఉద్దేశించి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మాల కులస్తుల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు కొందరు రాజకీయ ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకువచ్చారని అందువల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మంద రంజిత్ ,బడుగు వీరస్వామి బరగడ రమేష్ బుడిబుడి ప్రతాప్, భోగిళ్ళ రమేష్, ఇల్లంగి తిరపతి ఇల్లంగి గోపయ్య బుడిబుడి ప్రభాకర్. కల్లోజు అన్వే ష్ కల్లోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post a Comment