బాధతో వెళ్తున్నాం. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.
బాధతో వెళ్తున్నాం. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక పిహెచ్సిలో ఏర్పాటు. చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాDM&HO భాస్కర్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఉద్యోగస్తులు ఆస్పత్రికి సహ ఉద్యోగులకు మరియు ప్రజలతో ఉన్న సంబంధాలను గుర్తుచేసుకున్న సమయంలో సహ ఉద్యోగులు భావోద్వేగానికి గురి కన్నీటి పర్యంతమయ్యారు. సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసి ఎవరిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని అదేవిధంగా ప్రజలు కూడా సహకరించారని సహ ఉద్యోగులను విడిచి వెళ్లాలంటే బాధాకరంగా ఉందని అన్నారు.
జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవలు అందించిన వారందరినీ అభినందించారు సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన సమయంలో అటు ప్రజలతో ఇటు సహ ఉద్యోగులతో అనుబంధాలు ఉంటాయని అయినప్పటికీ ఉద్యోగ విధుల్లో బదిలీల్లో తప్పవని ఆయన అన్నారు ఎలాంటి మచ్చ లేకుండా ఉద్యోగం చేయడం ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత అనీ గుర్తు చేశారు.
అనంతరం బదిలీపై వెళ్తున్న డెంటిస్ట్ డాక్టర్ వినోద్, సిహెచ్ఓ వెంకటేశ్వర్లు ,హెచ్ వి సుభద్ర, ఫార్మసిస్ట్ శశికళ, యూ డి సి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం పార్వతిలను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు. మండల వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు.తదితరులు పాల్గొన్నారు.
Post a Comment