ఘనంగా వీడ్కోలు.పాల్గొన్న గ్రామ పెద్దలు.పాపకొల్లు ఎంపీపీ స్కూల్.

ఘనంగా వీడ్కోలు.పాల్గొన్న గ్రామ పెద్దలు.పాపకొల్లు ఎంపీపీ స్కూల్.


ఘనంగా వీడ్కోలు.పాల్గొన్న గ్రామ పెద్దలు.పాపకొల్లు ఎంపీపీ స్కూల్.



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు మండల ప్రజా పరిషత్ పాఠశాల లో బుధవారం ఘనంగా ఫేర్వెల్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్మాస్టర్ జ్యోతి గ్రామ పెద్దలను ఆహ్వానించారు.

 ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ పాఠశాలకు గ్రామస్తుల నుంచి మంచి సహకారం అందిందని సహకారం ఇలానే ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఫేర్వెల్ జరపటం ఒకపక్క సంతోషంగా ఉన్న మరో పక్క 5వ తరగతి విద్యార్థులు వెళ్లిపోతున్నారని బాధ ఉందని అన్నారు పిల్లలందరూ మంచిగా చదువుకొని ప్రయోజకులై తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు .






ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మీరా సాహెబ్ పెద్దలు రామ్ శెట్టి రాంబాబు బండ్ల మధుసూదన్ రావు  కొదుమూరి కోటేశ్వరరావు ధర్మరాజుల  వెంకటనారాయణ యాస రోశయ్య అమృనాయక్ రమేష్ రాథోడ్ ధారావత్ నాగేశ్వరరావు యదులాపురం గోపాలరావు తో పాటు ఉపాధ్యాయులు హాలావత్ నరసింహారావు. శ్యాంసుందర్ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. చిన్నారులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు.


 *పూర్వ విద్యార్థి జ్యోతి బీరువా వితరణ*


 పూర్వ విద్యార్థి జ్యోతితండ్రి లేటు శేషయ్య చారిఆ స్కూల్లో 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. ఆ మాస్టారు కూతురు జ్యోతి అదే స్కూల్లో చదివి ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. తన తండ్రి ఇటీవలమరణించారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆ స్కూల్ కు ఓ బీరువా అందజేశారు.

Blogger ఆధారితం.