ఆదాయ,కుల దృవీకరణ పత్రాలు ఆలస్యం.దరఖాస్తు దారుల్లో ఆందోళన.
ఆదాయ,కుల దృవీకరణ పత్రాలు ఆలస్యం.దరఖాస్తు దారుల్లో ఆందోళన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేస్తున్న వారికి గడువు దగ్గర పడుతుండడంతో ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాల సకాలంలో అందుతాయో లేదో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ఈ పథకం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులు కూడా అధిక సంఖ్యలో ఉండడంతో ద్రువపత్రాల జారి ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొందరు దరఖాస్తు చేసి పది, పదిహేను రోజులు కావొస్తున్న సర్టిఫికెట్లు ఇంకా చేతికి రాకపోయేసరికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తు సమయాన్ని కొంతకాలం పొడిగించింది. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు త్వరగా అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
Post a Comment