ప్రపంచ ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ప్లాస్టిక్ను తరమి వేయాలంటూ వినూత్న ప్రచారం.
ప్రపంచ ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ప్లాస్టిక్ను తరమి వేయాలంటూ వినూత్న ప్రచారం.
ప్లాస్టిక్ను తరిమి వేయాలంటూ వినూత్న ప్రచారం.* ప్రపంచ ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవం. ప్లాస్టిక్ ఉపయోగం నివారించాలంటూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వాసి ప్రభుత్వ ఉద్యోగి ఆయన తిప్పర్తి శివ ఫ్ల కార్డును ప్రదర్శిస్తూ మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలను సందర్శిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని క్యాన్సర్కు కారణమవుతున్న ప్లాస్టిక్ను నిషేదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భవిష్యత్ తరాలను కాపాడాలంటే ప్లాస్టిక్ ను పూర్తిగా నివారించాలని అవగాహన కల్పిస్తున్నారు మండుటెండలో సైతం కాలినడకన నడుస్తూ మైక్ లో ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాలను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యంగా కూరగాయల షాపులు కిరాణం షాపువద్ద ప్లాస్టిక్ సంచులు ఉపయోగాన్ని తగ్గించాలని కస్టమర్లు వచ్చినప్పుడు వారిని గుడ్డతో తో ఏర్పాటు చేసిన సంచులను తెచ్చుకోవాల్సిందిగా కస్టమర్లకు వివరించాల్సిన బాధ్యత షాప్ యజమానులపై ఉందని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికే ప్లాస్టిక్ వల్ల అనేకమంది క్యాన్సర్ బారిని పడుతున్నారని క్యాన్సర్ ఉపయోగాన్ని తగ్గించుకోనేందుకు భవిష్యత్ తరాలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ప్లాస్టిక్ ఉపయోగం తగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటికే ప్రజలు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల పశువుల కడుపులోకి వెళుతున్నాయని దానితో జంతువులను సైతం హాని కలుగుతుందని అదేవిధంగా పేపర్ ప్లేట్స్ ఉపయోగం వల్ల కూడా నిత్యం ప్రజల కడుపులోకి ప్లాస్టిక్ వెళుతుందని అవగాహన కల్పిస్తున్నారు వినూత్న ప్రదర్శన ద్వారా మండల వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న శివకు ఎంతో మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Post a Comment