మేత కోసం వెళ్లిన గేదే.పది రోజుల తర్వాత తోటలో తల కనిపించింది.
మేత కోసం వెళ్లిన గేదే.పది రోజుల తర్వాత తోటలో తల కనిపించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాప కొల్లు ముత్యాలమ్మ కాలనీ కీ చెందిన ఓ రైతుగేదెను పెంచుకుంటున్నాడు. ఆగేదే ఐదు నెలల చూడు తో ఉంది. ముద్దుగా పెంచుకుంటున్న గేదె మరో 5 నెలల తర్వాత పాలు ఇస్తుందని సంబరపడ్డ రైతు 10 రోజుల క్రితం మేత కోసం బయటకి వదిలిపెట్టాడు. బయటికి గేదేఎప్పుడు వెళ్లినా , గంటా, లేదా రెండు గంటల్లో ఇంటికి తిరిగి వస్తుందని ,సాయంత్రం అయినా గేదెఇంటికి రాకపోవడంతో ఆ రైతు ఆందోళన చెంది తాను పెంచుకుంటున్న గేదె కోసం రాత్రి పగలు తేడా లేకుండా వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం పెద్ద హరిజనవాడ సమీపంలోని ఓ మామిడి తోటలో తన గేదెకు సంబంధించిన తల కనిపించడంతో అల్లాడిపోయాడు. ఇంత ముద్దుగా పెంచుకుంటున్న గేదె తల కనిపించడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు. తన గేదెను మాంసం కోసం ఎవరో కోసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ గేదెను హతమార్చిన వారి కోసం ఆరా తీసే పనిలో ఉన్నాడు. అయితే ఒక గేదే కాకుండా మరో గేదే ఆచూకీ తెలియడం లేదనీ మరో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ రెండు గేదెలు కూడా బయటకు వెళితే కలిసి వెళ్లే గేదెలని ఆ రైతు చెబుతున్నాడు.
Post a Comment