రైతులకు నష్టం కల్గిస్తున్న మొక్కజొన్న.నష్టపోతున్న రైతులు.


రైతులకు నష్టం కల్గిస్తున్న మొక్కజొన్న.నష్టపోతున్న రైతులు.



రైతులకు నష్టం కల్గిస్తున్న మొక్కజొన్న.నష్టపోతున్న రైతులు.








జూలూరుపాడు మండల వ్యాప్తంగా చాలా మంది రైతులు ఆడ మగ మొక్కజొన్న పంటను వేశారు అయితే పంట ప్రారంభంలో కొందరు డీలర్ల మంటూ చెప్పుకుంటూ రైతుల వద్దకు వెళ్ళి విత్తనాలు మేమేఇస్తాం, మేము చెప్పినంత దిగుబడి రాకపోతే ఆదుకుంటాం, అడ్వాన్సుగా కొంత డబ్బు ఉంచండి అని చెప్పి రైతులకు ఎకరాకు కొంత డబ్బులు ముట్ట చెప్పడం, విత్తనాలు వేయమని చెప్పగా రైతులు దిగుబడి వస్తుందనే, కారణంగా వారి మాటలు నమ్మి ,వారి మధ్య ఎలాంటి నిఖితపూర్వక ఒప్పందాలు లేకుండానే పంటను సాగు చేస్తున్నామంటున్నారు రైతులు.

తీరా పంట చేతికి వచ్చాక పంటను తీసుకువెళ్లడానికి విత్తనాలు ఇచ్చిన సదరు డీలర్లు ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు దిక్కు తోచనీ పరిస్థితిల్లొ ఉంటున్నారు. అయితే ఈ విషయం వ్యవసాయ అధికారులకు కూడా తెలియకపోవడం మండల వ్యాప్తంగా ఆడ మగమొక్కజొన్న సాగు ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదు.

 రైతులు మాత్రం వారు పండించిన పంటను తీసుకు వెళ్ళమని చెబుతుంటే కనీసం సమాధానం ఇవ్వడంని లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఈ ఆడ మగ మొక్కజొన్న సాగు పెద్ద మొత్తంలోనే జరుగుతోంది అయితే కొందరికి డీలర్లు చెప్పినంత దిగబడి రాకపోగా. ,పండించిన పంటను ఎవరు తీసుకువెళ్తారొ కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది .అయితే రైతులు చేసేదేమీ లేక మండల వ్యవసాయ అధికారీ దీపక్ ఆనంద కలిసి  న్యాయం చేయాలంటూ దరఖాస్తులు మాత్రం అందజేశారు. అయితే సదరు డీలర్లు మాత్రం రైతులకు నోటి మాటల ద్వారా హామీలు చెప్పటమే తప్ప లిఖితపూర్వక హామీలు ఎక్కడా లేవంటున్నారు రైతులు.

Blogger ఆధారితం.