సోనియా రాహుల్ పేర్లు చార్జి సీట్లో చేర్చడం కుట్రపూరితమే. తొటదేవి ప్రసన్న ఆధ్వర్యంలోభారీ ర్యాలీ, నిరసన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో ఆదివారం నల్ల దుస్తులు ధరించి ఫ్ల కార్డులు చేతబూనీ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ గారి పిలుపులో భాగంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుఆదేశానుసారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ సోనియా గాంధీ పేర్లను కావాలని బిజెపి కక్షపూరిత రాజకీయాల వేధింపుల భాగంగా చార్జి సీట్ల వారి పేర్లను చేర్చ డాన్ని నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించి ప్లకార్డులు చేతబూని నిరసన తెలియజేశామని చెప్పారు కొత్తగూడెం పట్టణ మూడవ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్లోనిఅంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు మోడీ సర్కార్ రాహుల్ గాంధీ అంటే భయపడుతున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసే అక్రమ కేసులు తెరపైకి తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కులగరణ సర్వే విజయవంతమైందని ఈ సర్వే దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని. గుజరాత్లో ఓడిపోతామని భయం పట్టుకుందని ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లుఔ తెరపైకి తీసుకోవడం బిజెపి జీర్ణించుకోలేకపోతుందని అన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు బండ్ల రజని వదిలి జ్యోతి తందాల సరిత గోడ దివ్య బర్ల నాగమణి బూరుగుపల్లి పద్మశ్రీ సున్నం లక్ష్మి కమలమ్మ సౌజన్య సుగుణ స్వరూప జయసుధ పార్వతీ కృష్ణవేణి ప్రియాంక సుశీల రాజేశ్వరి విద్య విజయలక్ష్మి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment