ఉపాధి హామీ కూలీకు వడదెబ్బ. చికిత్స పొందుతూ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడుకు చెందిన షేక్ జాన్ బీ,52 సంవత్సరాలు ప్రతిరోజు ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనులకు వెళుతుంది ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం ఉపాధి హామీ పనులుకు వెళ్లి ఎండ దెబ్బతో తీవ్ర అస్వస్థకు గురి అయింది.
ఇంటికి తీసుకువచ్చి ఆమెకు ప్రథమ చికిత్స అందించారు ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా బీపీ పెరిగిపోవడంతో జూలూరుపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు అక్కడ డాక్టర్ల సలహా మేరకు కొత్తగూడెం లోని ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసంస్థానిక మమత హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. జాన్ బీ,దినిరుపేద కుటుంబం అయినందున ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు .
Post a Comment