బెల్లం, పటిక నాటు సారాస్వాధీనం.ఇద్దరు వ్యక్తులపై కేసు
బెల్లం, పటిక నాటు సారాస్వాధీనం.ఇద్దరు వ్యక్తులపై కేసు .
జూలూరుపాడు మండలంలో సోమవారం ఎక్సైజ్ పోలీసులు జరిపిన సోదాలో వెంగన్నపాలెంలోని ఓ కిరాణాషాపులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 8500 విలువగల 120 కేజీల బెల్లం తో పాటు 25 కేజీల పట్టిక రెండున్నర లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని కొత్తగూడెం స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జయశ్రీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఎవరైనా నాటు సారా తయారీకీఉపయోగించే ముడిసరుకు విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఎస్సై శ్రీహరి,HC ప్రకాష్ ముత్తయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment