కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం.త్వరగా ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్.


కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం.త్వరగా ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్


కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం.త్వరగా ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువవికాస్ పథకానికి ప్రధానంగా కావాల్సిన కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం నిరుద్యోగ యువతీ యువకులు మీసేవ మరియు తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నేటికీ వారం రోజులుగా నూతనంగా ఒక్క కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చిన దాఖలాలు లేవు కానీ జూలూరుపాడు తాసిల్దార్ కార్యాలయంలో నేటికీ సుమారుగా 1200 దరఖాస్తులు గుట్టలుగా తాసిల్దార్ కార్యాలయంలో ఉన్నాయనీ సిపిఎం మండల పార్టీ కార్యదర్శి ఆరోపించారు.






 ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి ఏప్రిల్ ఐదో తారీకు చివరి రోజు అని చెబుతోంది రేపటినుండి మూడు రోజులపాటు సెలవు దినాలు ఉన్నాయి కానీ కుల ఆదాయతృవీకరణ పత్రాలకే రోజులు పడితే ఇదేందని తాసిల్దార్ కార్యాలయం నందు అడిగితే సర్వర్ పనిచేయట్లేదని సంబంధిత అధికారులు లేరని చెబుతున్నారు కానీ మరి చివరి డేటు దగ్గర పడుతోంది ఆదాయకుల ధ్రువీకరణ పత్రాల కోసమే ఎన్ని రోజులు  ఆగితే రేపు ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులకు ఎన్ని రోజులు వేచి ఉండాలి ఒకపక్క గత ప్రభుత్వ అయామ్ నుండి నేటిదాకా రేషన్ కార్డు రాక యువతీ యువకులు ఎదురుచూస్తూ ఉన్నారు.

 నూతనంగా పెళ్లి చేసుకొని నూతన ప్రభుత్వం అందిస్తానన్న రేషన్ కార్డు కోసం ఉన్న రేషన్ కార్డులో పేర్లు తొలగించుకొని కొత్త రేషన్ కార్డులు  కొరకు దరఖాస్తు చేసుకున్న వారు మండలాల్లో వందల సంఖ్యలో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకంలో రేషన్ కార్డ్ మరియు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కంపల్సరీ జతచేయాలని చెబుతున్నారు 

ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం మేము దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు రేషన్ కార్డులు లేక ఉద్యోగాలు లేక మండలంలో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న యువతీ యువకులు ఉన్నారు కావున రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న యువతి యువకుల్ని కూడా రాజీవ్ యువ వికాస్ పథకానికి అర్హులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు తేదీని పెంచాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.