పరిక్షా కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ జుంకీలాల్347 మంది విద్యార్థులకు 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహణ

 

పరిక్షా కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ జుంకీలాల్347 మంది విద్యార్థులకు 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహణ


పరిక్షా కేంద్రాలను పరిశీలించిన ఎంఈఓ జుంకీలాల్347 మంది విద్యార్థులకు 10 పబ్లిక్ పరీక్షలు నిర్వహణ






శుక్రవారం నుంచి పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మండల పరిధిలో రెండు సెంటర్లలో ఏర్పాటు చేసినట్టు ఎంఈఓ బానోత్ జూంకిలాల్ తెలిపారు.మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 347 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు.

 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 304 మంది విద్యార్థులు,43 మంది ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రజలకు హాజరవన్నారు.వశిష్ట,సెయింట్ ఆంథోనీ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కలిపి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.

జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 170 మంది,సెయింట్ ఆంథోనీ స్కూల్లో 177 మంది పరీక్ష నిర్వహించనున్నారు. బాలికలు 206,బాలురు 141 లకు పరీక్షలు జరగనున్నాయి.పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు,ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు,ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని తెలిపారు.పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల కొరకు వెలుతురు కొరకు లైట్లను,త్రాగేందుకు నీటిని, ఫ్యాన్లు ఇతర ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించబడుతుందని ఎంఈఓ తెలిపారు.

శుక్రవారం ఉదయం 9:30 గంటల నుండి,12:30 గంటల వరకు సమయం కేటాయించారు.దూర ప్రాంత విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలు సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేది వరకు పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.డిపార్ట్మెంటల్ ఆఫీసర్,సిట్టింగ్ కేర్,కస్టోడియన్,జాయింట్ కస్టొడియన్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబడతాయని ఎంఈఓ జూంకిలాల్ తెలిపారు.

Blogger ఆధారితం.