ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు అందక అవస్థలు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు అందక అవస్థలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలల నుంచి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా ఉందని ఫీల్డ్ అసిస్టెంట్స్ మండల అధ్యక్షుడు మూడు రమేష్ మాట్లాడారు.ఇలాంటి తరుణంలో జీతాలు రెండు, మూడు నెలలకు ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు.
మా పైఅధికారుల ఆదేశానుసారంగా ప్రతి పనిని సమర్ధవంతంగా చేయించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ టార్గెట్ ఇచ్చినా ఫీల్డ్ అసిస్టెంట్స్ గా మేము సమర్థవంతంగా పని చేయించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కారం చేస్తారని గౌరవ తెలంగాణ పెద్దలకు విన్నవించుకుంటున్నాము.
ఈ సమావేశంలో మండల ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధ్యక్షులు ధరంసోత్ రవి, కార్యదర్శి బాణోత్ వీరభద్రమ్, కమిటీ మెంబర్స్ హరికిషన్, జగదీష్, నగేష్, బాల్య,నరేష్, లక్ష్మి, నాగమణి,షరీఫ్ పాల్గొనడం జరిగింది.
Post a Comment