ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
జూలూరుపాడు. వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని శుక్రవారం జూలూరుపాడు లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి మాతాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు 50 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు ప్రత్యేక హారతులు పాటలతో మహిళలు సందడి చేశారు.
ఆర్యవైశ్యులతో పాటు ప్రజలందరినీ చల్లంగా చూడాలని వ్యాపారంగ అభివృద్ధితోపాటు పాడి పంట లు పిల్లాపాపలతో తులతూగాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘ రాష్ట్ర నాయకురాలు తొండెపు నాగమణి, జిల్లా నాయకులు తొండెపు సరిత ,పెండ్యాల నదియా, పెండ్యాల భానుమతి, సీమ కుర్తి చిట్టెమ్మ, నంగునూరి మీనా, పెండ్యాల సీతాకుమారి ,కంచర్ల రమాదేవి,
పెండ్యాల ఝాన్సీ ,వందనపు నాగమణి, కొదుమూరి అంజలి, చిట్లూరి పద్మ, పెండ్యాల రామలక్ష్మి ,వెచ్చ తాయారు, సీమ కుర్తి నాగలక్ష్మి, పెండ్యాల శిరీష, పుల్లకండం సంధ్య, పెండ్యాల చంద్రకళ, ఉడతా శైలజ, ఉడతా సారిక ,పెండ్యాల కావ్య, కొ దుమూరి గాయత్రి, పెండ్యాల శైలజ ,వేముల అనురాధ ,చిట్లూరి సాహితీ, దివ్య రీతు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment