తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించాలనే నిర్ణయం సరైంది కాదు.ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించాలనే నిర్ణయం సరైంది కాదు.ప్రభుత్వం పునరాలోచన చేయాలి.


తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించాలనే నిర్ణయం సరైంది కాదు.ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,"పెండ్యాల విజయభాస్కర్.

తెలుగు విశ్వవిద్యాలయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాలనే నిర్ణయం సరైనది కాదని ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ అన్నారు 

ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని అసువులు బాసిన పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడారని అన్నారు, స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని మహాత్మా గాంధీ ప్రశంసలు అందుకున్నారని అటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికో రాష్ట్రానికి చెందిన వాడు కాదని అన్నారు శనివారం జరిగిన సమావేశంలో తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చాలని నిర్ణయానికి ఆమోదం తెలపడం పట్ల రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోని ఆర్యవైశ్యుల తోపాటు తెలుగు భాషాభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు 

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టా లనే నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాపరెడ్డి  పేరు పెట్టి గౌరవించాలని విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యధావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Blogger ఆధారితం.