భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూనంనేని కి మరియు కలెక్టర్ కార్యాలయంలో వినతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూనంనేని కి మరియు కలెక్టర్ కార్యాలయంలో వినతి.
తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరు యదా విధంగా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకీ, మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయం నుండి తొలగించడం బాధాకరమన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు అటువంటి మహనీయుని పేరును తొలగించే విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు.
పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతాని కో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ నాయకుడని హరిజను లు దేవాలయాల ప్రవేశాలకై సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతను రూపు మాపటానికి తీవ్రంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు అటువంటి మహనీయుని పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు సూరవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని అందులో ఎటువంటి సందేహం లేదు అన్నారు నూతనంగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టి గౌరవించాలని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయ భాస్కర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుగూరి నగేష్ కుమార్,కోశాధికారి చీమకుర్తి తాతా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధారా యుగంధర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెండ్యాల ప్రసాద్ రావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు ధారా నగేష్, సభ్యత్వ నమోదు కమిటీ చైర్మన్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, దమ్మపేటమండల అధ్యక్షులు పసుమర్తి రామభద్రం, మండల అధ్యక్షులు ఉడత వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండల అధ్యక్షులు వారణాసి సురేష్, మణుగూరు మండల అధ్యక్షులు చిత్తలూరి రమేష్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు తెల్లాకుల డైమండ్ రావుజిల్లా, బిక్కుమల్ల సుధాకర్ ,ఉపాధ్యక్షులు: తమ్మిశెట్టి రమేష్, కడివెండి విశ్వనాథ్ గుప్తా, ధారా నరసింహారావు, నరేంద్రుల హేమంత్ ,కంచర్ల రామారావు, పసుమర్తి శ్రీనివాస్, తల్లాడ ఉపేందర్,గునిపాటి సుధాకర్, సహాయ కార్యదర్శి: దాచేపల్లి పిచ్చయ్య, వెచ్చా శ్రీరాములు తల్లాడ సాయికుమార్, కోశాధికారి కొదమూరు భాను ప్రకాష్, సాత్విక్, బసవయ్య, వారణాసి బాబు, గణేష్, కొదుమూరి సురేష్, తమ్మిశెట్టి విజయ్, వందనపు వీరభద్రం, డాక్టర్ జి వి రావు, , తదితరులు పాల్గొన్నారు.
Post a Comment