ఘనంగా బాబు జగజ్జీవన్ రావ్ జయంతి. నివాళులర్పించిన  నాయకులు.


ఘనంగా బాబు జగజ్జీవన్ రావ్ జయంతి. నివాళులర్పించిన  నాయకులు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు జయంతిని ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి బాబు జగజ్జివన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.





 ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని జగజ్జీవన్ రావు కు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉద్యమ నాయకుడు వేల్పుల నరసింహారావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావ్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి దళితులు పదవులు పొందటానికి దిక్సూచిగా మారారని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన బాబు జగజీవన్ రావ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించాలని మంచి సంస్కరణలు తెచ్చారని కొనియాడారు గాంధీ గారి మార్గంలో నడిచిన బాబు జగజీవన్ రావు ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాలత్ మంగీలాల్ నాయక్ మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు. పాలేపు నాగేశ్వరరావు మోదుగు రామకృష్ణ నాగరాజు. నరసింహారావు సుందర్ రావు. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.