రంజాన్ నెల ఉప వాసాలు ప్రారంభించిన ముస్లిం సోదరులు.పేదల పట్ల, పరుల పట్ల సోదర భావంతో ఉండాలి. ఇస్లాం బోధనలు.

 రంజాన్ నెల ఉప వాసాలు ప్రారంభించిన ముస్లిం సోదరులు. పేదల పట్ల, పరుల పట్ల సోదర భావంతో  కలసి మెలసి ఉండాలి. ఇస్లాం బోధనలు.

రంజాన్ నెల ఉప వాసాలు ప్రారంభించిన ముస్లిం సోదరులు.పేదల పట్ల, పరుల పట్ల సోదర భావంతో ఉండాలి. ఇస్లాం బోధనలు.



*రంజాన్ఉపవాసాలు ప్రారంభం* 

సామూహిక ఇఫ్తార్ విందు ఇందులో పాల్గొన్న ముస్లిం సోదరులు.





రంజాన్ మాసపు నెలవంక శనివారం సాయంత్రం కనిపించడంతో ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శనివారం రాత్రి నుంచి రంజాన్ నెలలో చేయబడే ప్రత్యేక తరావిహ్ నమాజ్ ప్రారంభమైంది.


పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్ష(రోజ)లు ఆదివారం తెల్లవారుజాము నుండి ప్రారంభమైయ్యాయి.నెలవంక కనిపించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగాముస్లింలు ఉపవాస దీక్షలు, అనంతరం సామూహిక ఇఫ్తార్ విందులో ఆదివారం పాల్గొన్నారుప్రత్యేక తరావిహ్ నమాజ్,జాకాత్, ఫిత్రా లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ రంజాన్ నెల లోనే అవతరించిందని ముస్లింలు విశ్వసిస్తారు.రాత్రుళ్లలో ప్రత్యేక తరావిహ్ నమాజ్ లొ హాఫిజ్,ఆలీమ్ లు ఖురాన్ పఠనం ప్రారంభింరు.


రంజాన్ నెల సందర్బంగా మండలంలోని మసీదులను రంగులు వేసి సుందరంగా అలంకరించారు.ముస్లిం సోదరులు తెల్లవారుజాము సహరి నుంచి సాయంత్రం ఇఫ్తార్‌ వరకు ఉపవాసదీక్షలు క్రమం తప్పకుండా పాటిస్తారు.బీదల పట్ల సోదర భావం కలిగి ఉండాలని,వారికి తమ ఇస్లాం నిబంధనల్లో సూచించిన విధంగా ఆర్థిక సహాయం చెయ్యాలనే సంకల్పంతొ ఉండాలని మౌల్వి,హాఫిజ్, ఆలీమ్ లు సూచిస్తుంటారు.


ఈ రంజాన్ నెలలో వెయ్యి రాత్రుల కంటే పవిత్రమైన రాత్రిగా షబ్బే ఖదర్ పేర్కొంటారని,ఈ రాత్రిలో ముస్లింలు నిద్ర పొకుండా ఖురాన్ పఠణం,అల్లాహ్ స్మరణ(తస్బి)తహజుద్ చేస్తూ జాగారం ఉంటారని తెలిపారు.


జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ (1) అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభవ శుభాకాంక్షలు తెలియజేసి ఆ లింగంనం చేసుకున్నారు.
Blogger ఆధారితం.