సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్రమార్కుల్ని అదుపులోకి తీసుకుంటున్న జూలూరుపాడు పోలీస్.

 

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్రమార్కుల్ని అదుపులోకి తీసుకుంటున్న జూలూరుపాడు పోలీస్.


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్రమార్కుల్ని అదుపులోకి తీసుకుంటున్న జూలూరుపాడు పోలీస్.





అదుపులో జెసిబి, ఐదు ట్రాక్టర్లు 

అక్రమఇసుక తరలింపు పై పోలీస్ దృష్టి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పరిధి లోనీ బేతాళ పాడు పెద్దవాగులో గత కొంతకాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ కొందరు ఇసుకతోవ్యాపారం చేస్తున్నారు. ఏకంగా జెసిబిలను పెట్టి గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి , తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు.సామాన్యులకు ఎక్కువ ధరలకు ఇసుకను అమ్ముతూతరలించే పనిలో ఉన్నారు. ఇటీవల  పోలీసుల అక్రమ ఇసుక దారులకు చెక్ పెట్టడంతో  అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలయ్యాయి. జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ రవి అక్రమ ఇసుక తరలించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో గురువారం తెల్లవారుజామున బేతాళ పాడు పెద్దవాగులొ జెసిబి తో ఇసుక తోడుతూ ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్నారనే సమాచారంతో పోలీసులకు అక్కడికి చేరుకొని అక్కడ కొందరిని అదుపులోకి తీసుకొని జెసిబిని ,ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారు జెసిపి యజమాని రమేష్ ,  రాందాస్ . ట్రాక్టర్ యజమానులు అనిత, క్రస్సా భీమ్లా, హుస్సేన్ లు గా గుర్తించారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.