ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు .
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు .
కొత్తగూడెం ( ) చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో నూతనంగా సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంత్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఏ గ్రేడ్ ధ్యానానికి రూ.2060, బీ గ్రేడ్ రూ.2040 చొప్పున మద్దతు ధర అందిస్తుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని,
దళారులకు రైతులు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, డిసిఏంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సొసైటీ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్, సొసైటీ డైరెక్టర్లు, మండల అధికారులు, నాయకులు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment