సర్వేకు ఎప్పుడు వస్తారొ అని ఎదురుచూపు.కూలి పనులకు వెళ్లకుండాఇంటి వద్దనే పడిగాపులు.ప్రయాణాలు వాయిదాలు. అధికారుల సమాధానాలు కరువు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సర్వే జరుగుతున్న విషయం విధితమే అయితే కొన్ని గ్రామాల్లో సర్వే కి ఎప్పుడు వస్తారు అని ప్రజలు కూలి పనులకు వెళ్లకుండా ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ సర్వే అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు .

అయితే ఏ గ్రామం లో ఎప్పుడు సర్వే చేస్తారు అనే సమయం తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని మండల అధికారులు గుర్తించి ఏ గ్రామంలో ఎప్పుడు సర్వే  చేస్తారు అనే విషయాలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు.

 కొందరు రెండు మూడు రోజుల నుంచి సర్వే వాళ్ళు ఇంటికి వస్తారేమో అని ఎదురు చూస్తున్నామని ఒకవేళ ఇంటిదగ్గర లేకపోతే సర్వేలో మిస్ అవుతామేమోనని విచారం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ గ్రామం ఏ రోజు,  ఏ వీధి ఏ రోజు చేస్తారు ప్రజలకు తెలియజేయాలని కూలి పనులు మానేసి ఊరు ప్రయాణాలు మానేసి ఎదురుచూడాల్సి వస్తుంది అని అంటున్నారు.

Blogger ఆధారితం.