పాఠశాల క్రీడా పోటీ లు ప్రారంభం.
పాఠశాల క్రీడా పోటీ లు ప్రారంభం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలను జూలూరుపాడు ఉన్నత పాఠశాల లో గురువారం మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ వెంకట్ ఆధ్వర్యంలోఘనంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధికారి కరుణాకర్ రెడ్డి, తో పాటు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, MPO తులసీరామ్ . బహుమతుల మరియు భోజనం సమకూరుస్తున్నదాత మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండ్యాల ప్రసాద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన గౌరవ వందనాన్ని అధికారులు స్వీకరించారు .అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు తోడ్పడతాయని, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని తద్వారా విద్య అభ్యసించేందుకు దోహదపడతాయని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో బిజీ జీవితాన్ని గడుపుతున్నామని ఈ క్రమంలో విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు
విజేతలైన టీమ్లను జిల్లా స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారని అన్నారు. విద్యార్థులు తమ క్రీడా శక్తిని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని అన్నారు. కార్యక్రమానికి భోజన వసతులతో పాటు బహుమతులను ప్రధానం చేస్తున్న జూలూరుపాడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండ్యాల ప్రసాదును అభినందించారు. కార్యక్రమంలో జూలూరుపాడు హెడ్మాస్టర్ వెంకట్ నరసయ్య కాకర్ల హెడ్మాస్టర్ సంజీవరావు పడమటి నర్సాపురం హెడ్మాస్టర్ పాపకొల్లు హెడ్మాస్టర్ మీరా సాహెబ్. కేవీజీవీబీ తో పాటు సెయింట్ ఆంటోనీ స్కూల్ పీఈటీలు తదితరులు పాల్గొన్నారు ఈ క్రీడలు 12 13 తేదీలలో జరుగుతాయని అన్నారు.
Post a Comment