చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు రజకుల అసంతృప్తి...
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పాపకొల్లు రజకుల అసంతృప్తి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజకులు ఎమ్మెల్యేని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను రజక సంఘం నాయకులు డీజే పాటలతో, పూలు చల్లుతూ ఐలమ్మ విగ్రహం వరకు mla ను తీసుకువెళ్లారు.ఈ క్రమంలో మరో వర్గం వారు ఓదాత ఇచ్చిన ఫ్రీజర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రామపంచాయతీకి అప్పచెప్పేందుకు తీసుకువెళ్లారు.
వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే నేరుగా ఐలమ్మ విగ్రహం వద్దకు రాలేదని కోపంతో రజకులు అసంతృప్తి చెంది ఐలమ్మ విగ్రహానికి వారే దండలు వేసుకున్నారు.ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యే ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి రజకులను శాంతింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ
రజకులు అసంతృప్తితోనే ఉన్నారు.ఈ కార్యక్రమంతో మరోసారి పాపకొల్లులో కాంగ్రెస్ లో వర్గ పోరు బహిష్కమైంది.
Post a Comment