హెల్మెట్ మనకు భద్రత. ట్రాఫిక్ రూల్స్ మన బాధ్యత.
హెల్మెట్ మనకు భద్రత. ట్రాఫిక్ రూల్స్ మన బాధ్యత.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జనవరి 6 టీవీ 17 న్యూస్ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలలో భాగంగా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం జూలూరుపాడు చంద్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం బరువుగా కాకుండా బాధ్యతగా ఫీల్ అవ్వాలని సూచించారు హెల్మెట్ ఎవరికోసమో పెట్టుకుంటున్నామనే భావన వదిలేయాలని హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది అని విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకొని ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు హెల్మెట్ తో పాటు వాహనాలు ఇన్సూరెన్స్ వాహనదారుడు కి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని ధృవపత్రాలు ఉంటె జరగరాని సంఘటనలు జరిగినప్పుడు మన కుటుంబానికి రక్షణగా ఉంటుందని అన్నారు హెల్మెట్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించవద్దని సూచించారు.
అదేవిధంగా అతివేగం ఓవర్ లోడ్ మూలమలుపులు వద్ద అతివేగంగా వెళ్లడం తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరగటం వల్ల వారి వారి కుటుంబాల్లో విషాదం మిగులుతుందని ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు కృషి చేసి రక్షణ బాధ్యతలు కూడా చేపట్టాలని సూచించారు. ట్రాక్టర్ల ట్రక్కులకు రేడియం స్టిక్కర్లను స్వయంగా అందించి ప్రతి ఒక్కరు తమ వాహనాలకు వెనుకాల రేడియంస్టిక్కర్ అంటించడం ద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడుచండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్లు బాదావత్ రవి చావల చంద్రశేఖర్ శివరామకృష్ణులు పాల్గొన్నారు.
Post a Comment