పోటు ప్రసాద్ సంతాప సభకు తరలిరండి.సిపిఐ శ్రేణులకు గుండు పిన్ని వెంకటేశ్వర్లు పిలుపు.
పోటు ప్రసాద్ సంతాప సభకు తరలిరండి.సిపిఐ శ్రేణులకు గుండు పిన్ని వెంకటేశ్వర్లు పిలుపు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం డిసెంబర్ 7 (టీవీ 17 న్యూస్) ప్రజాతంత్ర ఉద్యమాల సారథి కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా రథసారథి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖమ్మం జిల్లా మాజీ కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ పోటు ప్రసాద్ సంస్మరణ సభను 8. .12 .2024 నాడు ఆదివారం ఉదయం 10 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ స్కూల్ (పాతమమతా మెడికల్ కాలేజ్) రోటరీ నగర్ లో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సభకు ఏఐటీయూసీప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమరజిత్ కౌర్ ,పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు ,సీనియర్ నాయకులు కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు., ఆంధ్రప్రదేశ్ సిపిఐ నాయకులు రామకృష్ణ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి తదితరులు ముఖ్యులు హాజరవుతారనీ కావున జిల్లా కార్యవర్గ సభ్యులు మండల పట్టణ కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్యులు తప్పనిసరిగా సంస్మరణ సభకు హాజరు కావాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ఆదేశానుసారం ఈ ప్రకటన ఇస్తున్నట్లు జూలూరుపాడు మండల సిపిఐ కార్యదర్శి గుండు పిన్ని వెంకటేశ్వర్లు తెలియజేస్తున్నారు.
Post a Comment