సాయి ఎక్స్ లెంట్ స్కూల్లో ఘనంగా ముందస్తు నూతన సంవత్సర వేడుకలు.
సాయి ఎక్స్ లెంట్ స్కూల్లో ఘనంగా ముందస్తు నూతన సంవత్సర వేడుకలు.
మండల కేంద్రమైన జూలూరుపాడులో గల సాయి ఎక్సలెంట్ స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరు సుఖ సంతోషాలతో, అప్లైశ్వర్యాలతో ఉండాలని, విద్యార్థులు మంచిగా చదివి పరీక్షలు బాగా రాసి ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. గత సంవత్సరంలో వచ్చిన నవోదయ సీట్ల కంటే ఈ నూతన సంవత్సరంలో నవోదయ సీట్లు, గురుకుల సీట్లు, ఏకలవ్య అత్యధిక సీట్లు సాధించి, జిల్లా, మండల స్థాయిలో స్కూల్ పేరును ఇనుమడింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్ధినీ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు డైరెక్టర్ శివకుమరీ B. సరిత సుజాత, నవ్య, కళ్యాణి వీరభద్రమ్ అనిత నబీన, దుర్గా భవాని, సాహితి, , పద్మ సత్యావతి, నాగలక్ష్మి, సరిత భాను,అఖిల రజిత అరుణ రేష్మ నందిని ప్రశాంతి రాంకుమార్ మృదుల్ రాంబాబు శాంతమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment