జూలూరుపాడు లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు, ఓ షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10,500 రూపాయల విలువగల 169 కేజీల బెల్లం, 7కేజీల పట్టికను స్వాధీనం చేసుకుని కొత్తగూడెం ఎక్సైజ్  పోలీస్ స్టేషన్ కి తరలింపు..

జూలూరుపాడు లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు, ఓ షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10,500 రూపాయల విలువగల 169 కేజీల బెల్లం, 7కేజీల పట్టికను స్వాధీనం చేసుకుని కొత్తగూడెం ఎక్సైజ్  పోలీస్ స్టేషన్ కి తరలింపు..

*కిరాణా దుకాణంలో ఎక్సైజ్ శాఖ తనిఖీ లు* .

 *సారా తయారీకి ఉపయోగించే బెల్లం పట్టిక* *స్వాధీనం.* 

 *ఆదుపులొ ఇద్దరు.. కేసు నమోదు?** 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 ( టీవీ 17 న్యూస్) జూలూరుపాడుమండల కేంద్రంలోని ఓ కిరాణం షాపులో రెండు క్వింటాళ్ల బెల్లం తో పాటు 20 కేజీల పటిక నుఎక్సైజ్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

 ఎక్సైజ్ అధికారి ప్రకాష్ చెప్పిన వివరాల ప్రకారం తవిసి గుట్ట తండా కు చెందిన వ్యక్తి బెల్లం పటిక ను మోటార్ సైకిల్ పైతీసుకువెళ్తుండగా పట్టుకొని విచారించగా అతని ద్వారా జూలూరుపాడు లోని ఓ కిరాణం షాపులో బెల్లం పటిక కొనుగోలు చేశానని చెప్పగా అధికారులు షాపు వద్దకు వచ్చి తనిఖీలు చేయగా తనిఖీల్లో సారా తయారీకి వినియోగించే సుమారు రెండు క్వింటాళ్ల బెల్లం తో పాటు 20 కేజీల పటీక దొరికినట్లు , 

బెల్లంను పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు , షాప్ యజమానిని, బెల్లం తీసుకు వెళ్తున్న వ్యక్తినీ కొత్తగూడెం స్టేషన్ తరలిస్తున్నామని కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Blogger ఆధారితం.